పోలీస్ అమర వీరుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఫ్లాగ్ డేలో ఆయన మాట్లాడారు. పోలీసులు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటారని కొనియాడారు. సీపీ విష్ణు ఎస్ వారియర్, అడిషనల్ డీసీపీ శబరీశ్‌తో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. గంగారం బెటాలియన్ పరిధిలో కమాండెంట్లు అమరుల త్యాగాలను గుర్తుచేశారు.
– నెట్వర్క్
మామిళ్లగూడెం, అక్టోబర్ 21: పోలీస్ అమర వీరుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఫ్లాగ్ డేలో ఆయన మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారన్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21న చైనా దురాక్రమణదారులను ఎదురొనే క్రమంలో లడక్ ప్రాంతంలో ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, అప్పటి నుంచి ఏటా ప్రభుత్వాలు పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నాయన్నారు. తొలుత మంత్రి అజయ్‌కుమార్, సీపీ విష్ణు, అమర వీరుల కుటుంబ సభ్యులతో కలిసి స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అడిషనల్ డీసీపీ శబరీశ్ పోలీస్ అమరుల త్యాగాలను వివరించారు. గార్డ్ అఫ్ హానర్ పరేడ్ కమాండర్‌గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రవి వ్యవహరించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ డీసీపీ సుభాశ్‌చంద్రబోస్, ఏసీపీలు రామోజీ రమేశ్, ఆంజనేయులు, రెహమాన్, ప్రసన్నకుమార్, బస్వారెడ్డి, వెంకటస్వామి పాల్గొన్నారు.
సత్తుపల్లి, అక్టోబర్ 21: పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గంగారంలోని 15వ బెటాలియన్‌లో కమాండెంట్ సయ్యద్ జమీల్‌బాషా అమర వీరులకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి, అదనపు కమాండెంట్ అంజయ్య, సహాయ దళాధిపతులు ఉదయ్‌భాస్కర్, నాగేశ్వరరావు, సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, దొడ్డా శంకర్రావు పాల్గొన్నారు.