ఖమ్మం, జూలై 15: పారిశుధ్య నిర్వహణతోపాటు పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ (ఏసీ) శ్రీజతో కలిసి కలెక్టర్ మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. వన మహోత్సవం, పారిశుధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఇందిరా మహిళా డెయిరీ తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పరిపాలన సజావుగా సాగేందుకు ప్రతి ఒకరూ తమవంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమం కింద అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్లపై అధిక శ్రద్ధ పెట్టాలన్నారు. పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్లు, పట్టణాల్లోని ప్రధాన రహదారుల వెంబడి పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. బ్లాక్ ప్లాంటేషన్‌కు నిత్యం నీటి సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రెండెకరాల్లో అర్బన్ పార్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించి, అకడ ఎలాంటి మొకలు నాటాలో ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక అందించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. డెంగ్యూ కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లో ఫీవర్ సర్వే చేయాలని, ఆ ప్రాంతంలో మరింత సమర్థవంతంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరా మహిళా డైయిరీ విషయంలో ఎకడైనా పొరపాట్లు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులలో నమోదయ్యే డెంగ్యూ, మలేరియా కేసుల సమాచారం స్థానిక సంస్థలకు ప్రతిరోజు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎకడా తాగునీటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం నేపథ్యంలో నీటి నాణ్యత పరీక్షలను రెట్టింపు చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, డీఎంహెచ్‌వో డాక్టర్ కళావతీబాయి పాల్గొన్నారు.