రుద్రంపూర్/ ఇల్లెందు/ మణుగూరు టౌన్, జూన్ 3 : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బొగ్గు గని కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి పరిధిలోని జీఎం కార్యాలయాల ఎదుట బుధవారం మహా ధర్నా, నిరసనలు చేపట్టారు. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచి కార్యదర్శి మల్లికార్జున్‌రావు, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, ఇల్లెందు జీఎం కార్యాలయం ఎదుట తెలిపిన నిరసన, ధర్నా కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా ఉపాధ్యక్షుడు మొహ్మద్ జాఫర్ హుస్సేన్, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్, మణుగూరులో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో తెలిపిన నిరసన కార్యక్రమాల్లో పలువురు నాయకులు మాట్లాడారు.
అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో కార్మికులు తమ సేవలను కోల్పోయిన క్రమంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగ విధానం అమలులోకి తెచ్చారని తెలిపారు. అయితే మెడికల్ టెస్టులో అర్హత సాధించి, అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ వందలాది మంది వారసులు నెలలు, ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ఆయా జీఎంలకు వినతిపత్రాలు సమర్పించారు.
కొత్తగూడెంలో టీబీజీకేఎస్ నాయకులు గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, కాగితపు విజయ్‌కుమార్, బూర్గుల రవికుమార్, ఎంటెక్ మహేందర్, కంచర్ల శ్రీనివాస్, బండారి రాజ్‌కుమార్, నమిల్ల వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు వీరస్వామి, కత్తెర్ల రాములు, సందబోయిన శ్రీనివాస్, హుమాయున్, భూక్యా రమేశ్, కమల్, సౌజన్య, సీనియర్ నాయకులు రాజేశ్వరరావు, సురేందర్, ఇల్లెందులో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్, కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్, నబీ, సత్యనారాయణ, ఘాజీ, ఉపేందర్‌రావు, లలిత్ పాసి, బావ్‌సింగ్, రవిగౌడ్, మణుగూరులో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రావు, ఏరియా ఉపాధ్యక్షుడు నాగెల్లి వెంకటేశ్వర్లు, బంగారి పవన్‌కుమార్, మునిగెల నాగేశ్వరరావు, సుద్దాల సంపత్‌కుమార్, మస్తాన్, మురళీకృష్ణ, జంగం రాజ్‌కుమార్, శంకర్, సంజీవరావు, అజ్మీరా అశోక్, రామారావు, వర్క్‌షాప్ రెడ్డి, శ్రీనివాస్, సర్వే నరేశ్, ఇల్లెందులో ఏఐటీయూసీ నాయకులు దాసరి రాజారాం, బాస శ్రీనివాస్, బొప్పిశెట్టి సత్యనారాయణ, కృష్ణ పాల్గొన్నారు.