మధిర, ఆగస్టు 30: బడుగు, బలహీన వర్గాలకు అండ సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. బోనకల్లు మండలం మోటమర్రిలో కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయపార్టీల నుంచి 50 కుటుంబాలు బీఆర్ఎస్ చేరాయి. వారికి జడ్పీ చైర్మన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విరివిగా నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, ప్రజలు తనకు ఓటేసి గెలించాలని పిలుపునిచ్చారు. దళితబంధు, బీసీ, మైనార్టీ ఆర్థిక చేయూత వంటి పథకాలు లబ్ధిదారులకు ఎంతో భరోసానిచ్చాయన్నారు. గూడులేని పేదల కోసమే సర్కార్ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే పల్లెలు అభివృద్ధి బాటపట్టాయన్నారు. దళితబంధు పథకం ద్వారా ఎంతోమంది లబ్ధిదారులు ట్రాక్టర్లు హార్వేస్టర్లు, పొక్లెయిన్ యూనిట్లు పొందారన్నారు. యూనిట్లు లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ఒక్క పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన చింతకాని మండలంలోనే 3 వేల మందికిపైగా యూనిట్లు పొందారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, వెంగళ కనకయ్య, కాకాని శ్రీనివాసరావు, పారా ప్రసాద్, తమ్మారపు బ్రహ్మయ్య, ఇటికాల శ్రీనివాసరావు, గుడిదె వీరబాబు, చిట్టిమోదు శ్రీనివాసరావు, కన్నెపోగు సురేష్, మందా నాగేశ్వరరావు, బలవంతపు నాగేశ్వరరావు, బంక కిరణ్, గుడిదె స్వామి, మందా నాగేశ్వరరావు, మందా నరసింహారావు, వల్లెబోయిన కొండలరావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి 15 కుటుంబాలు..
గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన బీజేపీ రైతు మోర్చా మండల అధ్యక్షుడు వజ్రాల మల్లాచారితో పాటు మరో 15 కుటుంబాలు బుధవారం గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరినవారికి జడ్పీ చైర్మన్ గులాబీ కండువాలు కప్పి మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు ముత్తారపు వెంపటి, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల బాబు పాల్గొన్నారు.