మిర్చి యార్డుకు పోటెత్తిన ఎర్ర బంగారం
వరుసగా మూడురోజులు సెలవుల అనంతరం ఖమ్మం ఏఎంసీ మిర్చియార్డులో సోమవారం క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాయి.
- ఒకే రోజు 50 వేల బస్తాలు..
- క్వింటా ధర రూ.23,600
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 10: వరుసగా మూడురోజులు సెలవుల అనంతరం ఖమ్మం ఏఎంసీ మిర్చియార్డులో సోమవారం క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే, శని, ఆదివారాలు వారంతపు సెలువులు కావడంతో ఆ ప్రభావం పంట ఉత్పత్తుల రాకపై కనిపించింది. మంచి సీజన్ కావడం, మార్కెట్లో మిర్చి పంటకు అధిక ధర పలుకుతుండడంతో రైతులు ఇదే అదునుగా భావించి భారీ మొత్తంలో పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం జెండాపాట సమయానికి వివిధ జిల్లాల నుంచి రైతులు 50,165 బస్తాలను తెచ్చారు. దీంతో యార్డులో ఎటుచూసినా ఎర్రబంగారమే కనిపించింది. అనంతరం జరిగిన జెండాపాటకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్పర్సన్.. పాట నిర్వహణ, క్రయవిక్రయాలను పరిశీలించారు. జెండాపాటలో తేజా రకం పంటకు క్వింటాకు రూ.23,600 ధర పలికింది. మధ్య ధర రూ.21 వేలు, కనిష్ట ధర రూ.17 వేలు, తాలు రకం గరిష్ట ధర రూ.15 వేలు, కనిష్ట ధర రూ.9 వేల చొప్పున నిర్ణయించి ఖరీదుదారులు పంటలను కొనుగోలు చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

