రెండోరోజు అదే జోరు.. ప్రగతి సారథి, అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు పండుగలా జరుపుకొంటున్నారు. సబ్బండవర్గాల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న జననేతపై అభిమానంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అన్నదాన, వస్త్రదానాలు చేపట్టారు. రోగులకు పండ్లు, రొట్టెలు, విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. కేక్‌లు కట్‌చేసి సంబురాలు జరుపుకున్నారు. పలుచోట్ల మొక్కలు నాటారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీచైర్మన్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమని ముక్తకంఠంతో పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మిన్నంటుతున్నాయి.. టీఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు బుధవారం రెండోరోజు పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు.. శిబిరాల్లో వందలాది మంది యువకులు రక్తదానం చేశారు.. నాయకులు గ్రామాల్లో బైక్ ర్యాలీలు న్విహించారు.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.. వేలాది మందికి అన్నదానం చేశారు.. నిరుపేద మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.. మరోవైపు గురువారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశారు..
– నమస్తే నెట్వర్క్