కారేపల్లి, అక్టోబర్ 15 : మహిళలపై దాడికి పాల్పడి గాయపరిచిన ముగ్గురు వ్యక్తులపై గురువారం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ బైరు గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గాంధీ నగర్ గ్రామానికి చెందిన ఈసాల కోటమ్మ ఈ నెల 2న గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ భూమిలో గేదెలను మేపుతుంది. కాగా అదే గ్రామానికి చెందిన ఈసాల వెంకన్న అతడి కుమారులు ఈసాల ఉదయ్, ఈసాల రాకేశ్ ఆమెపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో నిందితులపై బీఎన్ఎస్ 296(B), 115(2), 74, 351(2), r/w3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.