హైకోర్టు తీర్పుతో బద్దలైన కుట్ర కోటలు.. కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూసిన కాంగ్రెస్‌కు గట్టి చెంప దెబ్బ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కుట్ర కోటలు బద్దలయ్యాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.
- నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టిన చరిత్ర బీఆర్ఎస్ది..
- రాష్ర్టాన్ని రెండున్నరేళ్లలో కరువు కోరల్లోకి నెట్టిన ఘనత రేవంత్ సర్కార్‌ది..
- ఖమ్మంలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కుట్ర కోటలు బద్దలయ్యాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక అబద్ధపు విచారణ కమిషన్లతో బద్నాం చేయాలని చూసిన స్కాంగ్రెస్కు న్యాయస్థానం సాక్షిగా గట్టి చెంప దెబ్బ తగిలిందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెల్లో ఉద్యమ సెగ రగిలించి, ఢిల్లీ పీఠాన్ని కదిలించి స్వరాష్ర్టాన్ని సాధించిన చరిత్రకు ఆయనే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, ఆంధ్రా మీడియా అందరూ కలిసి తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ, కేసీఆర్ పవిత్రత మరోసారి రుజువైందని ఆయన స్పష్టం చేశారు.
ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టిన చరిత్ర కేసీఆర్‌ది..
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లోరోసిన్ రక్కసితో వేలాది మంది జీవితాలు చితికిపోతుంటే.. యాభై ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ గాడిద పండ్లు తోముకుంటూ కూర్చున్నదని తాతా మధు ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో కాళ్లు వంకర్లు పోయి, యవ్వనంలోనే ముసలి వాళ్లుగా మారి, పెళ్లిళ్లకు కూడా నోచుకోని ప్రజానీకాన్ని చూసి చలించిపోయిన కేసీఆర్.. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించి ఫ్లోరోసిస్ వ్యాధిని తరిమికొట్టి చరిత్ర సృష్టించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం బహుళార్థసాధక ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తిచేసి పచ్చని పొలాలతో తెలంగాణ రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మేడిగడ్డలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే, మరమ్మతులు చేయకుండా కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. నీటిని నిల్వచేసే తెలివి లేక, మేడిగడ్డ గేట్లు అన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు వదిలి తెలంగాణలో ఈరోజు నీటి కరువు తెచ్చిన ద్రోహి రేవంత్‌రెడ్డిది అని ధ్వజమెత్తారు.
రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ ఆశయం
తెలంగాణ రైతును రాజుగా చూడాలని, వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్నదే మాజీ సీఎం కేసీఆర్ ఆశయమని తాతా మధు అన్నారు. అందుకే బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల్ని అమల్లోకి తెచ్చారన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినప్పటికీ రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. వరి, మక్కలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తలేదన్నారు. పాలన చేతగాని కాంగ్రెస్సోళ్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుని ఇబ్బంది పెట్టేందుకు విచారణ కమిషన్లను ఏర్పాటు చేసి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. రేవంత్‌కు పాలనకంటే.. బూతులు మాట్లాడటం, పక్క రాష్ర్టాలతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం మీదనే ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. రైతాంగంతోపాటు అన్ని వర్గాలను నట్టేట ముంచిన రేవంత్ సర్కారు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ జిల్లా కమిటీ స్వాగతిస్తోందని, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా అంతిమంగా ధర్మమే గెలిచిందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, తాజుద్దీన్, ముత్యాల వెంకటప్పారావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, ఈదుల రాజేశ్, బెల్లంకొండ గోపి, మహ్మద్ రఫీ, కృష్ణప్రసాద్, పోలెపొంగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

