కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం జరుగనున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయంతం చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని ఆశీర్వదించండి: నామా
ఖమ్మం, మే 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం జరుగనున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయంతం చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మంలలో జరిగే ఈ ప్రచారానికి పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. బ్యాలెట్ పేపర్లోని మూడో క్రమ సంఖ్యలో రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతుడు రాకేశ్‌రెడ్డి అని గుర్తుచేశారు. సేవ చేయాలనే ఉన్నతాశయంతోనే అతడు రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. చట్టసభల్లో పట్టభద్రుల గొంతు వినిపించేందుకు రాకేశ్‌రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

