ఖమ్మం, ఫిబ్రవరి 1 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలవారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 4వ తేదీన ఖమ్మం రానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో కేటీఆర్ పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎలా పని చేయాలో కార్యకర్తలు, నాయకులకు సూచనలు చేయనున్నారు. పార్టీకి ఉన్న బలంతోపాటు ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. సమావేశానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.