నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘చలో బస్ భవన్’ కార్యక్రమానికి గురువారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్ భవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులు తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేశారు. వారిని పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు అంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం.. సామాన్యులపై భారం మోపే విధంగా చార్జీలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. చార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
అశ్వారావుపేటలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, ఆరేపల్లి గోవింద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతకానిలో బీఆర్ఎస్ నాయకులు మంకెన రమేశ్, బొడ్డు వెంకటరామారావు, గురిజాల హన్మంతరావు, మాజీ ఎంపీపీ పోనుగోటి రత్నాకర్, ఓబూరి నరేశ్‌లను అరెస్టు చేశారు. కొణిజర్లలో తనికెళ్ల మాజీ సర్పంచ్ చల్లా మోహన్‌రావు, బోడపోతుల బాబులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. భద్రాచలంలో బీఆర్ఎస్ నాయకులు ఆకోజు సునీల్‌కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, కొల్లం జయప్రేమ్కుమార్, అయినాల రామకృష్ణలను అరెస్టు చేశారు.
ఇల్లెందులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్, నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, సిలివేరి సత్యనారాయణ, జేకే శ్రీను, ఎలమందల వాసు, మహ్మద్ జబ్బార్, రాంలాల్ పాసి, లలిత్‌కుమార్ పాసి, డేరంగుల పోశం, గిన్నారపు రాజేశ్, కిషన్ పాసి, వార రమేశ్, రాచపల్లి శ్రీను, సతీశ్లను పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మీదేవిపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. మణుగూరులో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, తురక రాంకోటి, గుర్రం సృజన్, రవిలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గుండాలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్, అజ్జు, వెంకన్న, గడ్డం వీరన్నలను పోలీసులు అరెస్టు చేశారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు సురేశ్, సతీశ్, జైదుర్గా ప్రసాద్, ఉపేందర్లను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వైరాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి, మాదినేని ప్రసాద్, ఆదూరి ప్రేమ్‌కుమార్, కారుకొండ బోస్, తోటకూర వీరబాబులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బూర్గంపహాడ్‌లో బీఆర్ఎస్ సారపాక పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, లక్ష్మీచైతన్యరెడ్డి, తిరుపతి, ఏసోబు, పంగి సురేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. పెనుబల్లిలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తల్లాడలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.