కారేపల్లి,అక్టోబర్ 31 : నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. రంగురాళ్లబోడు, మూడుతండా, స్టేషన్ చీమలపాడులలో నాయకులు ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి మదన్‌లాల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వాంకుడోత్ జగన్, పెద్దబోయిన ఉమాశంకర్, హన్మకొండ రమేశ్, ఉన్నం వీరేందర్, అడ్డగోడ ఐలయ్య, అడప పుల్లారావు, సుడిగాలి బిక్షం, మాలోత్ కిశోర్, బానోత్ కుమార్, బానోత్ సక్రాం, శంకర్, హనీఫ్, రోషయ్య, సీతారాములు, సత్యనారాయణ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, అక్టోబర్31: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ పలుగ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గుబ్బగుర్తిలో పోట్ల శ్రీనివాసరావు, మీర్జారోశన్రెడ్డి, తాటి శ్రీనివాసరావు, సత్యనారాయణ, ముస్తఫా, వేలాద్రి, పుల్లయ్య, ప్రసాద్, రోషన్, నర్సారావు, సతీశ్, సైదులు, ఉపేంద్ర, కృష్ణారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వైరాటౌన్, అక్టోబర్31 : రాష్ట్రంలో అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి బానోత్ మదన్‌లాల్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వైరాలో 8,9,6 వార్డుల్లో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. కార్యక్రమంలో నాయకులు ముళ్లపాటి సీతారాములు, పసుపులేటి మోహన్‌రావు, కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, మురళీకృష్ణ, మద్దెల రవి, బాణాల వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్, వెంకటేశ్వరరావు, రామారావు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, అక్టోబర్31: బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజును అఖండ మెజార్టీతో గెలిపించాలని మధిర ఏఎంసీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు కోరారు. మంగళవారం ఎర్రుపాలెంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, దేవరకొండ శిరీష, శీలం కవిత, మొగిలి అప్పారావు, యాకోబు, చిరంజీవి, సురేష్, బాలరాజు, బాలాజీ, నాగరాజు, మాణిక్యరావు, ప్రభాకర్, వెంకయ్య, చిన్నవెంకయ్య, శ్రీను, దానయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బోనకల్లు, అక్టోబర్ 31: బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు గెలుపు కోరుతూ మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బంధం శ్రీనివాసరావు, మోదుగుల నాగేశ్వరరావు, తమ్మారపు బ్రహ్మయ్య, గరిపాకుల రామకృష్ణ, పిల్లం వెంకటేశ్వర్లు, బోడేపూడి నరసింహారావు, కిరణ్, రామారావు, గద్దల దావీదు, మీడిడాల సతీశ్, సాంబత్తిని కృష్ణార్జునరావు, లింగయ్య, కిరణ్, భాస్కర్, వెంకటేశ్వర్లు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, అక్టోబర్ 31 : నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ గెలుపు కొరకు మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల, గ్రామ శాఖ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.