అశ్వారావుపేట రూరల్, జూన్ 25ఃతెలంగాణ రాష్ట్ర ప్రజల సంప్రదాయాలకు ప్రతీక బోనాలు వేడుకలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణపురం గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా బోనాలు వేడుకలను జరుపుకున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును ఆహ్వానించారు. స్దానిక జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, సర్పంచ్ కంగాల పరమేశ్, రైతుబంధు సమితి కన్వీనర్ వెంకట నర్సింహారావులతో కలిసి బోనాలు ఎత్తుకుని కొద్ది దూరం మహిళా భక్తులు కలిసి నడిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు వేడుకలను జరుపుకుంటారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతంలో బోనాలు జరుపుకున్న పరిస్థితి లేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నారన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, పాడి పంటలతో వర్థిల్లాలని అమ్మవారిని కోరిప్రార్ధించినట్లు తెలిపారు. గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం నుంచి కాలి నడకన డప్పు వాద్యాలతో గ్రామంలో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్లి దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించారు. అక్కడి నుంచి కట్టమైసమ్మ ఆలయానికి వెళ్లికి బోనాలు సమర్పించారు. ఆడబిడ్డలు అంతా గ్రామానికి చేరుకోవటం వల్ల ఆ గ్రామంలో సందడి నెలకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపలి శ్రీరామ్మూర్తి, మందపాటి మోహన్‌రెడ్డి, గ్రామస్తులు ఉపసర్పంచ్ శ్రీనివాస్, నులకాని శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, చందా లక్ష్మినర్సయ్య, ఆకుల నాగేశ్వరావు, చందా రామారావు, చందు ముసలయ్య, నిర్మల సత్యనారాయణ, చందా సతీష్, నారదాసు రామారావు, పలువురు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.