భద్రాచలం, నవంబర్ 15: బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్యదైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పీఎం దర్తీ ఆలా జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం సందర్భంగా భద్రాచలం ఐటీడీఏలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు.
తొలుత కలెక్టర్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల భూములను వారికి తిరిగివ్వాలని తెగ పెద్దలతో కలిసి తెల్లదొరలపై బిర్సా ముండా పోరాడారని వివరించారు. తొలుత గిరిజనుల నృత్యాలు, చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులు శంకర్రావు, డేవిడ్‌రాజు, విద్యాచందన, మణెమ్మ, తానాజీ, రాంబాబు, రమణయ్య, అలివేలు, మంగతాయారు, లక్ష్మీనారాయణ, భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, నవంబర్ 15: 19వ శతాబ్దానికి చెందిన ఆదివాసీ ప్రజా నాయకుడు.. బిర్సాముండా అని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈయన నేతృత్వంలో ఉల్గులాన్ అనే గొప్ప బిర్సాముండా 150వ జయంతి వేడుకలను ఖమ్మంలోని గిరిజన భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్తీ ఆలా భగవాన్ బిర్సాముండా జయంతిని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15న జన జాతీయ గౌరవ దివస్‌గా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు.