కారేపల్లి, జూలై 25 : భూ భారతి కింద భూ సమస్యల పరిష్కారానికి స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని కామేపల్లి, సింగరేణి మండలాల తాసీల్దార్ కార్యాలయాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
దరఖాస్తులకు సంబంధించి భూ భారతి ఆన్లైన్ పోర్టల్ లో నోటీసులు జారీ చేయాలన్నారు. భూ భారతి పోర్టల్ నియమ నిబంధనల మేరకు దరఖాస్తులపై పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తులకు నోటీసులు జారీ, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట కామేపల్లి, సింగరేణి మండల తాసీల్దార్లు సీహెచ్.సుధాకర్, ఎ.రమేశ్, అధికారులు ఉన్నారు.