కారేపల్లి, మే 31 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో జూన్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు భూ భారతిపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాసీల్దార్ ఎస్.సంపత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాసీల్దార్ సంపత్ కుమార్, డిప్యూటీ తాసీల్దార్ కృష్ణయ్య నేతృత్వంలో రెండు టీమ్‌లుగా ఏర్పడి 3వ తేదీన సింగరేణి, విశ్వనాధపల్లి, గిద్దవారిగూడెం, వెంకిట్యాతండా, 4వ తేదీన విశ్వనాధపల్లి, భజ్యాతండా, కోమట్లగూడెం, కొమ్ముగూడెం, 5వ తేదీన గాదెపాడు, మాణిక్యారం, సూర్యతండా, అప్పాయిగూడెం, 6వ తేదీన పేరుపల్లి, రావోజీతండా, మొట్లగూడెం, ఎర్రబోడు, 9వ తేదీన గుంపెళ్లగూడెం, కొత్తతండా, చీమలపాడు, నానునగర్‌తండా, 10న మాదారం, మంగళితండా, గేటురేలకాయలపల్లి, బోటితండా, 11న కొత్తకమలాపురం, పాతకమలాపురం, జైత్రాంతండా, రేలకాయలపల్లి లలో సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అలాగే 12న గేటుకారేపల్లి, గంగారంతండా, పాటిమీదుగుంపు, బాజుమల్లాయిగూడెం, 13న దుబ్బతండా, రేగులగూడెం, తొడితలగూడెం, టేకులగూడెం, 16న చిన్నమడెంపల్లి, సీతారాంపురం, 17న పోలంపల్లి, ఉసిరికాయలపల్లి, 18వ తేదీన భాగ్యనగర్‌తండా, గుట్టకిందగుంపు జరపతలపెట్టినట్లు తెలిపారు. రైతులు ఈ సదస్సులో తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తే వాటిని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.