సారపాక, జనవరి 20: బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందని పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మణుగూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమితి సింగారానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 80 కుటుంబాలకు చెందిన వారు, కట్టుమల్లారానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రావులపల్లి నాగరాజు, కొర్సా రత్నం తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా రేగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం రేగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత నేతల్లో మరింత జోష్ పెరిగిందన్నారు. పినపాక నియోజకవర్గంలో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకువస్తుందన్నారు. పార్టీ నాయకులు అచ్చిరెడ్డి సంజీవరెడ్డి గోపి, విజయలక్ష్మి, గణేశ్, షభానా, సోమరాజు, కుడితిపూడి కోటేశ్వరరావు, బీరెల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.