కొత్తగూడెం టౌన్, మార్చి 10 : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు పరిష్కారం కోసం పంపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.