కల్లూరు, నవంబర్ 17: నియోజకవర్గ ప్రజలందరూ వారి కళ్ల ముంగిట అభివృద్ధిని చూడాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. అదే సమయంలో నియోజకవర్గ ప్రగతి కోసం పనిచేసిన వాళ్లను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కల్లూరు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యిర్థి సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్లతో కలిసి చండ్రుపట్ల, రఘునాతబంజరు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సండ్ర అహర్నిశలూ శ్రమించారని, సత్తుపల్లిని అన్ని రంగాల్లో ముందుంచారని వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.1,000 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన ఎమ్మెల్యే సండ్రను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. రాజకీయ అవకాశవాదుల పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పే వారికి బుద్ధిచెప్పాలని కోరారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని గమనించిన పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఎర్రబోయినపల్లి, పేరువంచ, ముగ్గు వెంకటాపురం, కొర్లగూడెం, నారాయణపురం, పెద్దకోరుకొండి తదితర గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాలెపు రామారావు, బీరవల్లి రఘు, కట్టా అజయ్‌బాబు, సింగిశాల పద్మ, ప్రసాద్, పుసులూరి శ్రీనివాసరావు, పోట్రు కిరణ్, గొల్లమందల ప్రసాద్, కాటంనేని వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, కువ్వారపు విజయ్‌రావు, అంజన్‌రావు, పెడకంటి రామకృష్ణ, బోబోలు లక్ష్మణ్‌రావు, కొరకొప్పు ప్రసాద్, సీహెచ్ కిరణ్, మేకల కృష్ణ, వల్లభనేని శ్రీనివాసరావు, వల్లభనేని భాస్కరరావు, వల్లభనేని మధు, దేవరపల్లి భాస్కరరావు, జక్కంపూడి కిశోర్, శీలంశెట్టి కిరణ్, కాటంనేని రాజేశ్వరరావు, దొడ్డపునేని రవి తదితరులు పాల్గొన్నారు.