పదేళ్లలో ఖమ్మాన్ని తీర్చిదిద్దా..
గడిచిన పదేళ్లలో ఖమ్మం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇకడి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వల్లనే నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2,500 కోట్ల నిధులు తీకురాగలిగానని అన్నారు.
- మంత్రిగా ఉండడం వల్లనే రూ.2,500 కోట్ల నిధులు తెచ్చా..
- నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ ఇన్ని నిధులు రాలేదు..
- అతడి వల్లనే అభివృద్ధి అని తుమ్మల నిస్సిగ్గుగా చెబుతున్నాడు
- ఎవరు ఎంతటి అభివృద్ధిని చేశారో నగర ప్రజలు గమనించాలి
- డివిజన్ల ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, నవంబర్ 8: గడిచిన పదేళ్లలో ఖమ్మం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇకడి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వల్లనే నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2,500 కోట్ల నిధులు తీకురాగలిగానని అన్నారు. ఖమ్మం చరిత్రలో ఈ నియోజకవర్గానికి ఏనాడూ మంతి పదవి రాలేదని, ఇంతటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఖమ్మం నగరంలో బుధవారం పర్యటించిన ఆయన.. 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు అధ్వర్యంలో సారథినగర్లో, 26వ డివిజన్ కార్పొరేటర్, మేయర్ నీరజ ఆధ్వర్యంలో చర్చికాంపౌండ్లో, 8వ డివిజన్ నేతల ఆధ్వర్యంలో వెలుగుమట్లలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన మాట్లాడారు. 75 ఏళ్లుగా ఖమ్మాన్ని పాలించిన ఏ పార్టీ కూడా ఇంతటి అభివృద్ధిని చేయలేదని అన్నారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వినియోగించుకున్నాయని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సబ్బండవర్గాల సంక్షేమ కోసం పనిచేసిందని అన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసి..
ప్రజల అవసరాల కోసం అనేక వసతులు, సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ఫలితంగా గడచిన పదేళ్లలో ఖమ్మం స్వరూపమే మారిపోయిందని అన్నారు. ఇకడ జరిగిన అభివృద్ధి ఇతర నగరాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల.. ఇదంతా తానే చేశానంటూ ప్రజలకు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడని విమర్శించారు. ఇకడ ఎవరు ఎంతటి అభివృద్ధిని చేశారో ప్రజలు గమనించాలని కోరారు. గెలవడం కోసం విష ప్రచారం చేస్తున్న వలస వాదులకు ప్రజలు గెట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ఇకడి ప్రజలు తుమ్మలను తరిమికొట్టినా మళ్లీ ఇకడికే వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఖమ్మం అభివృద్ధి కోసం ప్రజలంతా బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, అమరగాని వెంకన్న, ఖమర్, పోట్ల రామనాథం, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, గౌతమ్ బాబా, వెంకటకృష్ణ, పోట్ల శ్రీకాంత్, అసిఫ్ అహ్మద్, బండ వెంకటేశ్, కన్నం ప్రసన్నకృష్ణ, పిట్టల ప్రవీణ్, బొల్లేపల్లి విజయ్, రవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

