భదాద్రి కొత్తగూడెం : కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై యువకుడు గోదావరిలో దూకాడు. భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇవాళ ఈ ఘటన జరిగింది. బూర్గంపాడు మండలం పినపాక వాసి ఉపేందర్ కుటుంబ కలహాల కారణంగా ఈ మధ్యాహ్నం భద్రాచలం వచ్చి గోదావరిలో దూకాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉపేందర్ మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.