రామవరం, సెప్టెంబర్ 06 : సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక శ్రేయస్సుకు నిర్వహించే యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ సోమవారం నుండి ప్రతి రోజు ఉదయం 6:30 గంటలకు రుద్రంపూర్ లోని ప్రగతి వనం నందు యోగా శిక్షణ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగా లాన్ వద్ద ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉద్యోగులందరూ యోగా ప్రాముఖ్యత తెలుసుకుని వారి రోజువారి కార్యక్రమాల్లో కొంత సమయాన్ని యోగాకు కేటాయించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.