రామవరం, ఆగస్టు 02 : మహిళా సమస్యల సాధన కోసం, మహిళా సాధికారతే లక్ష్యంగా ఉద్యమాల రూపకల్పనకు ఆదివారం జరిగే మహిళా భారత మహిళా సమాక్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) కొత్తగూడెం 3వ పట్టణ మహాసభను జయప్రదం చేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు, పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. శనివారం లక్ష్మీ టాకీస్ ఏరియా వన్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు అనేక రంగాల్లో పురుషులతో పాటు సమాన విధులు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలపై వివక్షత కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి రూ.2,500 తక్షణమే అందజేయాన్నారు. సీపీఐ శాఖ కార్యదర్శి ముద్ధం మార్తమ్మ, తమ్మ దుర్గ, బి.పద్మ, రావిచెట్టు పద్మ, నూరి, తేలగరి మాణిక్యమణి, కత్తుల ప్రేమవాణి, బానోత్ సునీత పాల్గొన్నారు.