భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 18 : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని భరోసా సెంటర్ ఎస్ఐ చల్లా అరుణ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరెట్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భరోసా సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను, పోక్సో చట్టం, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా వుండాలన్నారు. భరోసా బృందానికి చెందిన కో-ఆర్డినేటర్ రేణుక, లీగల్ సపోర్ట్ పర్సన్ శిరీష, సభ్యులు అంబికా, రమాదేవి, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, రిసెప్షనిస్ట్ అనూష తమ బాధ్యతలు, సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అనూరాధ, మహిళ,శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖాధికారులు, సిబ్బంది, సఖి సిబ్బంది, మహిళా సాధికరికత కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Bhadradri Kothagudem : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్ఐ చల్ల అరుణ