రామవరం, డిసెంబర్ 09 : ఖమ్మం జిల్లాలోని వర్తక సంఘ భవనంలో ఈ నెల 7న జరిగిన 30వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2025లో కట ఈవెంట్లో చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న మాస్టర్ సీహెచ్.జైదీప్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విద్యార్థిని అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా జాతీయస్థాయిలో మరెన్నో ప్రతిష్టాత్మక పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.