నర్సాపురం జడ్పీ పాఠశాలలో సోషల్ ఆడిట్
దుమ్మగూడెం మండలం నరసాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి, ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ఆడిటర్ తాటి హరీష్ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం..
దుమ్ముగూడెం, ఆగస్టు 04 : దుమ్మగూడెం మండలం నరసాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి, ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ఆడిటర్ తాటి హరీష్ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం బెక్కంటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉపాధ్యాయుల సహకారంతో సోషల్ ఆడిట్ నిర్వహించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, వాటి నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, రిజిస్టర్లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఐ.ఎఫ్.పి. ప్యానల్స్ నిర్వహణ, తరగతి గదుల నిర్వహణను వారు పరిశీలించారు. అలాగే పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ ల్యాబ్ నిర్వహణ తీరును అభినందించారు.
అదేవిధంగా ఎన్జీఓ సహకారంతో కంప్యూటర్లను తీసుకుని పాఠశాల స్థాయిలో అద్భుతంగా నిర్వహణ చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించటం గమనార్హం. అదేవిధంగా పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న లైబ్రరీని చూసి ఉపాధ్యాయులను అభినందిస్తూ సాధ్యమైనంత త్వరలో మీకు కావాల్సిన పుస్తకాలన్నీ రానున్నట్లు వారు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులతో, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులతోనూ విడివిడిగా సమావేశమై పాఠశాల పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

