కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 13 : ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రాజెక్ట్ ప్లానింగ్ జనరల్ మేనేజర్ బి.దేవేందర్‌ను బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆయన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధి కోసం అందరు సమిష్టిగా కృషి చేయాలన్నారు. సింగరేణి సంస్థలో అన్ని సంఘాలకు యాజమాన్యం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో అధ్యక్షుడు అమీరిశెట్టి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వివి రావు, జనరల్ సెక్రెటరీ నల్లపూరి రమేశ్, కార్పొరేట్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గోలి వెంకటేశ్వర్లు, డిజిఎం కార్పొరేట్ కమిటీ అడ్వైజర్ ఎడవల్లి యాదగిరి, సీనియర్ సర్వే ఆఫీసర్, కార్పొరేట్ లైసెన్ ఆఫీసర్ వేముల మురళి, డిజిఎం రవి కుమార్, సిహెచ్ శ్రీనివాస్, పాల శ్రీనివాస్, మహేందర్ నాథ్, పిఎస్ నాగరాజు, సీనియర్ సర్వే అధికారి బి.విజయ్ చందర్, సర్వే అధికారి చిందం శ్రీనివాస్, ఎడిషనల్ మేనేజర్ కె.రవికుమార్, సీనియర్ సర్వే ఆఫీసర్ పాల్గొన్నారు.