Ramavaram : కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు వీక్షకులు కరువు
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు పోటాపోటీగా కనువిందుగా సాగుతున్నాయి. సంస్థ డైరెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
రామవరం, నవంబర్ 29 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు పోటాపోటీగా కనువిందుగా సాగుతున్నాయి. సంస్థ డైరెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాగా అధికారుల వైఫల్యం వల్ల కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు తగినంత ప్రచారం కల్పించకపోవడంతో కార్మికులు, ప్రభావిత గ్రామాల ప్రజలు, క్రీడాభిమానులు ఎవ్వరూ ఈ క్రీడా ఈవెంట్ వీక్షణకు రాకపోవడంతో గ్యాలరీల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.
క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ పోస్టర్లు, బ్యానర్లు, సోషల్ మీడియా ప్రచారం, ప్రకటనలు తగినంతగా లేనందున ఈవెంట్ గురించి సమాచారం జనానికి చేరడం లేదని కార్మిక సంఘాల ప్రతినిధులు అన్నారు. కోల్ ఇండియా స్థాయిలో నిర్వహించే ఇలాంటి పోటీలకు వీక్షకులు అధిక సంఖ్యలో తరలివస్తే క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుందన్నారు. కానీ ఇక్కడ గ్యాలరీల్లో జనాలు లేక కుర్చీలు ఖాళీగా ఉంటుండడంతో క్రీడాకారుల్లోనూ ఉత్సాహం ఆవిరయ్యే అవకాశం లేకపోలేదన్నారు. కార్మిక సంఘాల నాయకులు. క్రీడల పోటీల నిర్వహణకు సంబంధించి కనీసం యూనియన్ నాయకుల సలహాలు, సూచనలు కూడా తీసుకోలేదన్నారు.
వీక్షించేందుకు రాని సింగరేణి కార్మికులు
సింగరేణి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలను వీక్షించేందుకు కార్మికులెవ్వరూ కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కొత్తగూడెం ఏరియా, సత్తుపల్లి ఏరియా, కార్పొరేట్ ఏరియాల్లో పనిచేసే కార్మికులెవరూ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో కనబడడం లేదు. కార్మిక సంఘానికి చెందిన కొందరు నాయకులు ఏదో నామమాత్రంగా వచ్చి హడావుడి చేసి వెళ్లిపోతున్నారు. రాబోయే రోజుల్లో క్రీడా విభాగం, నిర్వాహకులు ప్రచారాన్ని మరింత బలోపేతం చేసి కార్మికులు, పట్టణ ప్రజలు, ప్రభావిత గ్రామాల నివాసితులు, క్రీడాభిమానులు తరలివచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

Ramavaram : కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు వీక్షకులు కరువు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

