అశ్వారావుపేట: భగవాన్ సత్యసాయిబాబా జయంతి పురస్కరించుకుని భక్తులు మంగళవారం సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. పట్టణంలోని కోనేరుచెరువు సమీపంలో ఉన్న సత్యసాయిబాబా ఆలయంలో సత్యసాయి 96వ జయంతి వేడుకలు పురస్కరించుకుని ఈ వ్రతాలు చేశారు. ఈ సందర్భంగా 108 పాదుకలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయన్నే బాబా ఆలయ సన్నిదికి చేరుకున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.