సర్వర్ మొరాయించడంతో ఆగిన రేషన్ బియ్యం పంపిణీ
సర్వర్ మొరాయించడంతో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయి లబ్దిదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలోని రేషన్ దుకాణం వద్ద లబ్దిదారులు రేషన్ బియ్యం కోసం వెళితే..
- ఇరవెండిలో లబ్దిదారుల పడిగాపులు
బూర్గంపహాడ్, ఆగస్టు 26 : సర్వర్ మొరాయించడంతో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయి లబ్దిదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలోని రేషన్ దుకాణం వద్ద లబ్దిదారులు రేషన్ బియ్యం కోసం వెళితే వేలిముద్రలు తీసుకునే యంత్రం మొరాయించింది. దీంతో గంటల కొద్దీ లబ్దిదారులు రేషన్ బియ్యం కోసం వచ్చి పడిగాపులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గుండి బాబూరావు, మహంకాళి రామారావు దుకాణం వద్దకు వెళ్లి లబ్దిదారుల ఇబ్బందులను గమనించి డిప్యూటీ తాసీల్దార్‌కు సమాచారం ఇచ్చి ఆయనను అక్కడకు పిలిపించి పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండగా సర్వర్ పనిచేయకపోవడం, ఈ నెల 30వ తేదీ వరకే గడువు ఉండడంతో రేషన్ అందని లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి అర్హుడికి బియ్యం అందేవరకు రేషన్ పంపిణీని ఆపవద్దని సర్పంచ్, ఉపసర్పంచ్ అధికారులను కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

