కొత్తగూడెం అర్బన్, మే 29 : కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకుడు రాసూరి శంకర్ అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. గురువారం హనుమాన్ బస్తీలోని రాసూరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కోదండరాం పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఖమ్మం జిల్లా కన్వీనర్ వర్దబోయిన బాబు, కొత్తగూడెం జిల్లా కన్వీనర్ మల్లెల రామనాథం, కాంట్రాక్ట్ కార్మిక హక్కుల పరిరక్షణ సంఘం జనరల్ సెక్రెటరీ మడిపల్లి కరుణాకర్, వైస్ ప్రెసిడెంట్ గూడలి యాకయ్య, ట్రెజరర్ అనిల్, సెక్రెటరీ సాదిక్, డ్రైవర్ల విభాగం ఇంన్చార్జి భాషబోయిన రవికుమార్, రామ్‌చందర్, తాండ్ర విజయ్, అర్జున్, రాజేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.