BHADRADRI | తపాలా సేవలను సద్వినియోగం చేసుకోండి : పోస్టల్ శాఖ జోనల్ అధికారి రవికుమార్..

దమ్మపేట: తపాలా సేవలను సద్వినియోగం చేసుకోండని, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత విస్తరించేందుకు శాఖ సన్నద్ధమైందని పోస్టల్ శాఖ మూడు జిల్లాల జోనల్ అధికారి రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని అల్లిపల్లి, గున్నేపల్లి, వడ్లగూడెం, మారప్పగూడెం, జమేదారుబంజరు, పెద్దగొల్లగూడెం, పార్కలగండి, పూసుకుంట, జగ్గారం, కొమ్ముగూడెం బ్రాంచ్ పోస్టాఫీసులను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మండలంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఈ తపాలా సేవలను మరింత విస్తరించేందుకు పోస్టల్‌శాఖ ఆదేశాల మేరకు వీటిని ప్రారంభించడం జరిగిందని, మారుమూల ఏజెన్సీ మండలంలో ప్రజలందరికీ తపాలా సేవలు అందేలా కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులకు తపాలా శాఖ ద్వారా పెన్షన్లు సక్రమంగా అందించేందుకు, ఎక్కువ దూరం వెళ్లకుండా వారిదగ్గర్లోనే సేవలు అందించేలా వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిఒక్కరూ తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఐపీ ప్రవీణ్‌కుమార్, మెయిల్ ఓవర్సర్ ఎస్.వెంకటేశ్వరరావు, ఎస్పీఎం మల్సూర్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పామాయిల్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్రప్రసాద్, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, సర్పంచ్ బెల్లం నాగమణి, ఎంపీటీసీ చలపతిలతో పాటు ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, పోస్టల్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

