సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సమీక్ష
సింగరేణి కాలరీస్ సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ల అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్‌సిటీలోని ట్రైడెంట్ హోటల్లో కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అధ్యక్షతన...
రుద్రంపూర్, ఆగస్టు 22 : సింగరేణి కాలరీస్ సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ల అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్‌సిటీలోని ట్రైడెంట్ హోటల్లో కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అధ్యక్షతన సింగరేణి ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసోసియేషన్ ప్రతినిధులు కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులపై పక్షపాత వైఖరితో ఛార్జ్షీట్లు, సస్పెన్షన్లు, కంపల్సరీ రిటైర్మెంట్లు వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. విజిలెన్స్ విచారణల సమయంలో వేధింపులు, ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించుకుంటున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలోని పాఠశాలలు, ఉమెన్స్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్హాక్, తాత్కాలిక బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ మూడేళ్లుగా ఎనిమిది సర్వేయర్ బ్యాక్లాగ్ పోస్టులతో పాటు హిందీ పండిట్ పోస్టులను భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ (పా) ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ప్రతినిధులు కోరారు. ఉద్యోగుల సమస్యలు, ప్రమోషన్లకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులు.. సింగరేణి యాజమాన్యంతో చర్చించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ I కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ దామెర ప్రవీణ్ కుమార్, కేంద్ర కార్యదర్శి మామిడిపల్లి మధు కృష్ణ, ఎస్ టి పి పి వైస్ ప్రెసిడెంట్ పులి సురేష్ పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ , డైరెక్టర్ (పా) గౌతమ పొట్రు , డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమల రావు, జనరల్ మేనేజర్ (పర్సనల్/ ఐ ఆర్ పి యం) జీవీ కిరణ్ కుమార్, జి.ఎం (వెల్ఫేర్) అజయ్ కుమార్ హాజరయ్యారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

