ఇల్లెందు, నవంబర్ 20 : ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా మౌలా చాన్ దర్గాహ్ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు చివరి రోజు గురువారం ముగింపు వేడుకలను కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇల్లెందు దో నంబర్ బస్తీ నుండి గంధకంతో ప్రారంభమైన ర్యాలీ సత్యనారాయణపురం దర్గా వరకు కేరళ వాయిద్యాలు, నాగపూర్ గానాలతో, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, గుర్రపు బగ్గీల మీద ఊరేగింపు భారీగా నిర్వహించారు. దో నంబర్ నుండి జగదాంబ సెంటర్, ఆమ్ బజార్, బుగ్గ వాగు, కొత్త బస్టాండ్, గోవిందు సెంటర్, సత్యనారాయణపురం మీదుగా నాగుల్ మీరా దర్గా వరకు భారీ ఎత్తున వచ్చిన భక్తుల మధ్య అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భారతదేశంలోనీ పలు పట్టణాల నుండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ దర్గా మాలిక్ గా ఓ హిందువు ఉండడం మత సామరస్యానికి నిదర్శనం. ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Yellandu : ఘనంగా నాగుల్ మీరా దర్గా ఉర్సు షరీఫ్ ముగింపు వేడుకలు

Yellandu : ఘనంగా నాగుల్ మీరా దర్గా ఉర్సు షరీఫ్ ముగింపు వేడుకలు

Yellandu : ఘనంగా నాగుల్ మీరా దర్గా ఉర్సు షరీఫ్ ముగింపు వేడుకలు