ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
కారేపల్లి మండల పరిధిలో గురువారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని కొత్తూరు తండాలో గల సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించిన స్వాగత తోరణం నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి...
– కొత్తూరు తండా సీతారామచంద్రస్వామి ఆలయ స్వాగత తోరణం నిర్మాణానికి శ్రీకారం
కారేపల్లి, అక్టోబర్ 29 : కారేపల్లి మండల పరిధిలో గురువారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని కొత్తూరు తండాలో గల సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించిన స్వాగత తోరణం నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. తదుపరి మోట్లగూడెం గ్రామంలో మండలానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

