– కార్పొరేటర్ మునిగడప పద్మ
రుద్రంపూర్, అక్టోబర్ 08 : పోషణ అభియాన్- పోషణ మాసోత్సవాల్లో భాగంగా రామవరం అంగన్వాడీ సెక్టార్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గురువారం రామవరంలో జరిగిన పోషణ అభియాన్ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ, సూపర్వైజర్ పార్వతి మాట్లాడుతూ పోషణ లోపం లేని సమాజాన్ని సాధించేందుకు మనందరం కంకణ బద్ధులమై అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందన్నారు. మన అంగన్వాడీ సెంటర్లు తక్కువ ఖర్చుతో మంచి పోషక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని తెలిపారు. రామవరం సెక్టర్ ఆధ్వర్యంలోని అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పోషక ఆహారాలు తయారు చేసి ప్రదర్శించి తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రామవరం డివిజన్స్ కార్పొరేటర్ కూరపాటి సుధాకర్, ఆకునూరి సుప్రియ, ఎర్రబెల్లి శంకర్, కంచర్ల హిమశ్రీ, బానోత్ స్వప్న నాయక్, టీచర్స్ ఎన్ సరోజ, భూక్యా దేవి, నీలవేణి, షహనాజ్ బెగం, జ్యోతి, రమాదేవి, అలివేలు, రాధిక, రజిత, పద్మ, ఆయాలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

‘పోషణ లోపం లేని సమాజాన్ని స్థాపిద్దాం’