Cannabis | ఖమ్మంలో రూ. 4 కోట్ల విలువ చేసే గంజాయి దహనం
Cannabis | తెలంగాణ మీదుగా తరలిస్తున్న సుమారు రూ. 4కోట్ల విలువ చేసే నిషేధిత గంజాయిని ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు.
ఖమ్మం : తెలంగాణ మీదుగా తరలిస్తున్న సుమారు రూ. 4కోట్ల విలువ చేసే నిషేధిత గంజాయిని (Cannabis ) ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని పాల్వంచ, అశ్వరావుపేట, మణుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 కేసుల్లో పట్టుబడ్డ 1065.13 కేజీల గంజాయిని ఖమ్మంలోని ప్రభుత్వ అమోదిత డిస్ట్రాయిడ్ కన్సల్టింగ్ ఏడబ్ల్యూఎస్ కంపెనీలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయిని దహనం చేశారు.

ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాలకు సరపరా అవుతున్న గంజాయిని తీసుకు వెళ్లాలంటే వయా ఖమ్మం, భద్రాచలం మీదుగా వెళ్లాల్సిందేనని అధికారులు వివరించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల ఎక్సైజ్ అధికారులు, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ టీమ్‌లు గంజాయిని కలిసి పట్టుకున్నారని తెలిపారు.
పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 కేసుల్లో 1036.43 కిలోల గంజాయి, అశ్వరావుపేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో 2.8 కిలోల గంజాయి, మణుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసుల్లో 25.9 కిలోల గంజాయిని పట్టుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో రూ.1.87 కోట్ల విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ వెల్లడించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

