ప్రమాద భరితంగా జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గం
జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూలమలుపు తిరిగిన వెంటనే..
రుద్రంపూర్, జూన్ 13 : జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూలమలుపు తిరిగిన వెంటనే ఈ గుంత ఉండటంతో రాత్రి వేళల్లో ప్రమాదాల ప్రమాదం అధికంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఫిల్టర్ బెడ్‌కు సంబంధించిన పైపుల ఏర్పాట్ల కోసం రహదారికి ఇరువైపులా తవ్వకాలు చేపట్టారు. అయితే పనులు పూర్తయిన అనంతరం తవ్విన ప్రాంతాలను సక్రమంగా పూడ్చకపోవడంతో పాటు మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతింది. దీంతో రహదారి మధ్యలో గుంత ఏర్పడటంతో పాటు పక్కల భాగాలు కూడా ఎత్తుపల్లాలుగా మారాయి.
మూలమలుపు కారణంగా ఎదురుగా వస్తున్న గుంతను గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఆదమరిచి వెళితే గుంతలో లేదా రహదారి పక్కనున్న ఎత్తుపల్లాలలో టైర్లు జారి కిందపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత సింగరేణి అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని, ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ప్రమాద భరితంగా జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

