‘కార్మిక సమస్యలు పట్టించుకోని ఐటీసీ యాజమాన్యం’
రెండు వారాలుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపట్టినా ఐటీసీ యాజమాన్యం ఆ సమస్యలను గాలికి వదిలేసిందని, చర్చలకు కూడా పిలవకుండా తాత్సారం చేస్తుందని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ..
– 14 రోజులుగా దీక్షలు చేస్తున్నా కనీస స్పందన కరువు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 08 : రెండు వారాలుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపట్టినా ఐటీసీ యాజమాన్యం ఆ సమస్యలను గాలికి వదిలేసిందని, చర్చలకు కూడా పిలవకుండా తాత్సారం చేస్తుందని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్పాషా అన్నారు. బుధవారం రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకోవడంతో ఈ దీక్షల్లో తోకల నరేశ్, ప్లాంటేషన్ మహిళా కార్మికులు బోళ్ల సమ్మక్క, దార్ల కవిత, పట్రా సుమిత్ర, గంధం సిరి పాల్గొని మద్దతు పలికారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. నిరసనలు 14 రోజులు పూర్తయినా ఐటీసీ యాజమాన్యం నుండి ఎలాంటి పిలుపులేదని, కార్మికుల సహనాన్ని పరీక్షిస్తే మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా ఐటీసీ యాజమాన్యం దిగి వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రిలే దీక్షల్లో జేఏసీ సభ్యులు ఆకిని సర్వేశ్వరరావు, కందాల వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, సూరిశెట్టి జగదీష్, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

