చుంచుపల్లి, ఆగస్టు 28 : చుంచుపల్లి మండల కేంద్రంలో భవిత కేంద్రం భవన నిర్మాణ స్థలాన్ని భద్రాద్రి కొత్తగూడెం డీఈఓ బి.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. భవిత కేంద్రం నిర్మాణానికి గాను స్థల సేకరణకు సంబంధించి ఎంఈఓ బి.బాలాజీ, పాఠశాల ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్ర విద్యార్థుల సామర్థ్యంలను పరిశీలించారు. అలాగే ప్రక్కనే ఉన్న బాబు క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. వ్యాయామ శాల స్థలాన్ని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను, పాత ఎంప్లాయిమెంట్ ఆఫీస్ స్థలాలను పరిశీలించారు. బాబూ క్యాంప్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.నీరజ, మండల అభివృద్ధి అధికారి సుభాషిణి, గ్రామ కార్యదర్శి వి.సురేశ్ పాల్గొన్నారు.