– రూ.20 లక్షలతో యూటి పనులకు భూమి పూజ
బూర్గంపహాడ్, జూన్ 16 : దోమలవాగు చెరువును మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా కల్పించే లక్ష్యంలో భాగంగా నకిరిపేట పంచాయతీలోని దోమలచెరువుకు సీతారామ సాగునీటిని మళ్లించేందుకు రూ.20 లక్షలతో నిర్మించనున్న యూటీ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమలవాగు చెరువును మినీ రిజర్వాయర్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో సుమారు 16 వేల ఎకరాల్లో రైతుల భూములకు సాగునీరు అందుతుందని తద్వారా సీతారామ నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.
అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లో ప్రతి ఎకరానికి సీతారామ కాల్వ ద్వారా గోదావరి జలాలు అందేలా కృషి చేస్తామని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఏఈ గణేషానాయక్, తాసీల్దార్ కేఆర్కే. ప్రసాద్, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ, భజన సతీశ్, ప్రసాద్, బాదం రమేశ్‌రెడ్డి, సర్పంచులు సర్పా నాగమణి, మందా నాగరాజు, బానోత్ నరసింహ, వారాల వేణు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, సుధాకర్‌రెడ్డి, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.