‘ఐటీసీ పెద్దలారా సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు’
29 రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నాం.. ఐటీసీ పెద్దలారా ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించండి.. లేదంటే సమ్మె తప్పదు.. కార్మికులుగా హెచ్చరిస్తున్నామంటూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ..
– కాంట్రాక్టు కార్మిక జేఏసీ హెచ్చరిక
బూర్గంపహాడ్, ఏప్రిల్ 23 : 29 రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నాం.. ఐటీసీ పెద్దలారా ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించండి.. లేదంటే సమ్మె తప్పదు.. కార్మికులుగా హెచ్చరిస్తున్నామంటూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్‌పాషా, బల్లెం నాగయ్య ఐటీసీ యాజమాన్య వైఖరిపై మండిపడ్డారు. గురువారం రిలే దీక్షల్లో శీరపు శ్రీకాంతరెడ్డి, రామిశెట్టి లక్ష్మి, బోళ్ల సమ్మక్క, పట్రా సుమిత్ర, గంధం సిరి, సోమందుల నీలిమ పాల్గొనగా బీఆర్డీయూ జనరల్ సెక్రటరీ షేక్ అజీమ్, సీఐటీయూ జనరల్ సెక్రటరీ మల్లికంటి వెంకటేశ్వర్లు, బీఎంఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి కార్మికులకు పూలమాల వేసి దీక్ష చేస్తున్న కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని తమ సంపూర్ణ మద్దతు కార్మికులకు ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కాంట్రాక్టు కార్మిక జేఏసీ నాయకులతో ఐటీసీ యాజమాన్యం తక్షణం చర్చలు జరపాలని, చర్చలు జరిపే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మికుల ఆగ్రహజ్వాలకు యాజమాన్యం మసికాక తప్పదని, ఇప్పటికైనా యాజమాన్యం చర్చలకు పిలవకపోయినా, సమస్యలు పరిష్కరించకపోయినా సమ్మెకు దిగుతామని ఇది కార్మికులుగా తమ హెచ్చరిక అంటూ యాజమాన్య వైఖరిని ఖండించారు. తక్షణమే ఐటీసీ యాజమాన్యం తన వైఖరి మార్చుకుని జేఏసీతో చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు చుక్కపల్లి బాలాజీ, ఆకిని సర్వేశ్వరరావు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

