రామవరం, జూలై 25 : సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) గా ఇటీవల నియమితులైన వెంకన్న జాదవ్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేశ్, ప్రధాన కార్యదర్శి భూక్య కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకె అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. సింగరేణి గిరిజన ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో సహాయ సహకారాలు అవసరం అని వెంకన్న జాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సింగరేణిలో వెంకన్న జాదవ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా కూడా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సింగరేణి సీఎండీ బలరాంకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకన్న జాదవ్ స్పందిస్తూ.. తాను సింగరేణి గిరిజన ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లుగా వారు తెలిపారు.