రామవరం, మే 07 : సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి కుటుంబాలు, మాజీ సింగరేణి ఉద్యోగుల, సింగరేణి ప్రాజెక్ట్ ప్రభావిత పునరావాస, పరిసర గ్రామాల నిరుద్యోగ యువతకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై నిర్వహించే ఉచిత శిక్షణా కోర్సులకు ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, శంషాబాద్, హైదరాబాద్ సహకారంతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 08 వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
1. డ్రైవాల్ & ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్ – విద్యార్హత ఐటిఐ (డ్రాఫ్ట్స్ మెన్, సివిల్)/ డిప్లొమా, సివిల్)
2. వెల్డింగ్ & ఫాబ్రికేషన్ టెక్నీషియన్ – విద్యార్హత ఐటిఐ ట్రేడ్స్ మెన్ (వెల్డర్/ఫిట్టర్/ ఎలక్ట్రిషన్)
3. ఆటోమొబైల్స్ & టూ వీలర్ టెక్నీషియన్ – విద్యార్హత ఐటిఐ (మోటర్/ డీజిల్ మెకానిక్)
4. ఎక్స్ వేటర్ ఆపరేటర్ – విద్యార్హత డిప్లొమా/ఐటిఐ
5. ఫుడ్ & బేవరేజ్ సర్వీస్ అసిస్టెంట్ – విద్యార్హత ఇంటర్ పాస్
6. ఆఫీస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ – విద్యార్హత గ్రాడ్యుయేట్ (గర్ల్స్)
7. ఫీల్డ్ టెక్నీషియన్ – ఎయిర్ కండీషన్ – విద్యార్హత ఐటిఐ/డిప్లొమా
8. ఎలక్ట్రికల్ & హౌస్ వైరింగ్ టెక్నీషియన్ – విద్యార్హత ఐటిఐ (ఎలక్ట్రిషన్)
కాలపరిమితి ఒక్క నెల, రెండు నెలల వరకు. ఎంచుకున్న కోర్సు బట్టి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వబడునని తెలిపారు.
ఒక్కొక్క బ్యాచ్ కు 30 మందికి శిక్షణ ఇవ్వబడుతుందని, ఆసక్తి కలిగిన కొత్తగూడెం ఏరియా పరిసర గ్రామాలకు చెందిన 18 నుండి 28 సంవత్సరాల వయసున్న నిరుద్యోగ యువతీయువకులు తమ దరఖాస్తులను 31.05.2024 లోపు కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ మైనింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (యం.వి.టి.సి) కార్యాలయం నందు సమర్పిందాలన్నారు. దరఖాస్తుకు మూడు ఆధార్ కార్డు జిరాక్స్లు, విద్యా అర్హత సర్టిఫికెట్స్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ జీరాక్స్ జతచేయాలన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మొబైల్ నంబర్ 9866117145 ను సంప్రదించాలని పేర్కొన్నారు.