రామవరం, జూలై 30 : మౌలానా ఆజాద్ యూనివర్సిటీ హైదరాబాద్ అందిస్తున్న సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఏడాది పాటు ఉచిత భోజనం వసతితో పాటు శిక్షణను యూనివర్సిటీ అందిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణకు మైనార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళలు కూడా అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో ఆగస్టు 5వ తేదీ వరకు తమ వివరాలను https://manuu.gleamappstore.com నందు నమోదు చేసుకోవాలన్నారు. ఉచిత శిక్షణ పొందేందుకు గాను విశ్వవిద్యాలయం వారు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర సమాచారం కోసం 8520860785 నంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు.