కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 02 : చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం, హైదరాబాద్లోని శంకర్ శంకర్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సేవా సంఘం సభ్యుడు రేఖ రాజశేఖర్ తెలిపారు. శనివారం కూలీలైన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని రైతు బజార్ పోచమ్మ తల్లి గుడి వద్ద ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం కొనసాగనున్నట్లు వెల్లడించారు.
శిబిరానికి వచ్చేవారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు జిరాక్స్, ప్రస్తుతం వాడుతున్న మందుల చీటీలు, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ తప్పనిసరిగా తీసుకు రావాలని సూచించారు. పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సేవా సంఘం కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి గోపిరెడ్డి, గునిగంటి చందర్, నమ్మి జగదీశ్, ఏమునూరు శివ, సుంకు కనకరాజు, తెలంగాణ సురేశ్, అత్తులూరి అరుణ్, వనమాల సుదర్శన్, ఠాకూర్ నారాయణ సింగ్, ఈర్ల శ్యామ్ పాల్గొన్నారు.