జూలూరుపాడు, మే 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్థానిక అధికారులతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో ప్రజా అవసరాలకు అణుగునంగా పంచాయితీ రాజ్ వ్యవస్ధను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. జూలురుపాడు మండల అభివృద్ధికి కోట్లాది రూపాయాలు తీసుకువచ్చినట్లు, సీతారామ జలాలు వైరా రిజర్వాయర్‌కు కలిపి వైరా నియోజకవర్గంలోని రైతులకి సాగునీరు, ప్రజలకి తాగునీటి అవసరాలు తీర్చినట్లు చెప్పారు. రూ.20 లక్షల వ్యయంతో STSDF నిధుల నుండి నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు తెలిపారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రజా అవసరాలకు అందుబాటులోనికి తీసుకురావాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.
జూలురుపాడు మండల ప్రజల అవసరాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పబ్లిక్ టాయిలెట్, బస్ సెల్టర్ నిర్మాణం చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ స్వాతి బిందు, ఎండీఓ కరుణాకర్ రెడ్డి, ఎంపీఓ తులశిరాం, పీఆర్ డీఈ, ఏఈ నాగేందర్, కార్తీక్, ఐటీడీఏ డీఈ, ఏఈ మధుకర్, యశ్వంత్, సీఐ, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి, రవి, పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్, జిల్లా నాయకులు లేళ్ల వెంకట్‌రెడ్డి, రోకటి సురేశ్, మధుసూదన్ రావు, ఆర్కే నాయుడు, నున్నా రంగారావు, నర్వనేని పుల్లారావు, యల్లంకి నాగేశ్వరావు, వెల్పుల నర్సింహరావు, రామిశెట్టి నాగేశ్వరావు, నున్న క్రిష్ణయ్య, ధారవత్ రాంబాబు, గుగులోత్ బాలాజీ, ఆలోత్ రఘ, మెంతుల క్రిష్ణ, పోతురాజు నాగరాజు, సీపీఐ నాయకులు నాగులు మీరా, సీపీఐ (ఎంఎల్) ధర్మా, క్రిష్ణ, గోపాల్‌రావు పాల్గొన్నారు.