రామవరం, జూలై 25 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఏరియా వర్క్ షాప్‌లో శుక్రవారం డీజీఎం టి.శ్రీకాంత్ ఆధ్వర్యంలో సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వర్క్ షాప్‌లోని అన్ని సెక్షన్లు తిరిగి సేఫ్టీకి సంబంధించిన సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పలు సమస్యలను సేఫ్టీ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సేఫ్టీ బూట్లు క్లాత్ షూస్ ఇవ్వడం వల్ల అవి చెమటకి చినిగిపోతున్నాయని, వాటి స్థానంలో లెదర్ షూస్ ఇవ్వాలన్నారు. మ్యాన్‌వే ముందు షెడ్డు లేకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు మస్టర్ చెప్పేటప్పుడు ఇబ్బంది అవుతున్నట్లు చెప్పారు. స్టేజీ సగంలో ఆగిపోయిందని, శాశ్వత క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చిందంటే వర్క్ షాప్ లో నీళ్లు నిల్వ ఉంటున్నాయని, రోడ్డును సరిచేసి డ్రైనేజీలు నిర్మించాలని, అన్ని సెక్షన్ల వెనుక నీళ్లు స్టోరేజీ అవుతుండడంతో డ్రైనేజీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఈ సమస్యలను సేఫ్టీ కమిటీ సభ్యులు డీజీఎంకు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ ఇంజినీర్లు బి.శంకర్, టి.అనిల్, ఎ.ఉపేందర్ బాబు, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎండీ సత్తార్ పాషా, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు వై.రవి, ఫోర్మిన్ ఇన్చార్జి ఎలక్ట్రికల్ రోషన్, మెకానికల్ ఫోర్ మెన్, సేఫ్టీ కమిటీ సభ్యులు ఎస్ డి.యాకుబుద్దీన్, ఎస్.తిరుపతి, కె. కరుణాకర్, బాబుద్దిన్, గుమ్మడి మురళి, ఎ.మహేశ్, సీనియర్ అసిస్టెంట్ ఎ.విల్సన్, జూనియర్ అసిస్టెంట్ జాన్ కెనడి పాల్గొన్నారు.