కొత్తగూడెం అర్బన్, మే 19 : ఆరోగ్యంగా వున్న ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయవచ్చు అని, ప్రాణాపాయ సమయంలో రక్తం ఎంతో అవసరమని ఆర్టీఓ సంగం వెంకట పుల్లయ్య, వెంకటరమణ అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం బస్టాండ్ సెంటర్లోని శారద విద్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటం మహా కార్యమన్నారు. సేకరించిన రక్తాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంస పత్రాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ జే బీ బాలు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఆర్టీఓ సభ్యులు బీ.జోషి, గౌరవ సలహాదారుడు లగడపాటి రమేశ్, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన సతీశ్, సభ్యులు ఎం.బాలు నాయక్, కమలాకర్, జుబ్బు, రాజేశ్, రాజు, శారద, సామాజిక సేవా కార్యకర్తలు, శారద కుటీర్ ప్రిన్సిపాల్, మెడికల్ సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు.
Kothagudem Urban : ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరు రక్తదానం చేయొచ్చు : ఆర్టీఓ సంగం వెంకట పుల్లయ్య