ప్రణాళిక లేని పనులు.. ప్రజాధనానికి పాతర!
రామవరం జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులు ఇప్పుడు అధికారుల ప్రణాళికా లోపానికి అద్దం పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు చేసిన వినతుల అనంతరం ఎట్టకేలకు డ్రైనేజీ నిర్మాణానికి కార్పొరేషన్ శ్రీకారం చుట్టడం..
– రామవరంలో డ్రైనేజీ పనులకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు
రుద్రంపూర్, సెప్టెంబర్ 02 : రామవరం జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులు ఇప్పుడు అధికారుల ప్రణాళికా లోపానికి అద్దం పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు చేసిన వినతుల అనంతరం ఎట్టకేలకు డ్రైనేజీ నిర్మాణానికి కార్పొరేషన్ శ్రీకారం చుట్టడం స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ, నిర్మాణ మార్గం మధ్యలో విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా నిలవడం అధికారుల ముందుచూపుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజా సౌకర్యం కోసం చేపట్టిన డ్రైనేజీ పనులకు విద్యుత్ స్తంభాలే అడ్డుగా మారడంతో, ముందుగా ప్రణాళిక ఎవరు రూపొందించారు? శాఖల మధ్య సమన్వయం ఎందుకు జరగలేదు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
నాలుగు మీటర్ల లోతులో కాలువ.. ఐదు మీటర్ల స్తంభానికి మిగిలేది ఎంత?
విద్యుత్ స్తంభాలను సాధారణంగా సుమారు ఐదు మీటర్ల లోతులో పాతుతారని, డ్రైనేజీ నిర్మాణం కోసం సుమారు నాలుగు మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపడితే స్తంభాల పునాదికి అత్యంత తక్కువ భూమి మాత్రమే మిగిలే అవకాశం ఉందని స్థానికులు, అనుభవజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్తంభాలకు సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా భూమిలో ఏర్పాటు చేసి పైభాగంలో విద్యుత్ లైన్లు లాగారని ఆరోపణలు వస్తున్నాయి. డ్రైనేజీ కోసం భారీగా తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో స్తంభాల స్థిరత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
33 కేవీ లైన్‌కు ముప్పు?
ఈ ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం 33 కేవీ విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేసి, భారీ ఇనుప నిర్మాణాలతో కూడిన స్తంభాలను ఏర్పాటు చేసినట్లు రామవరం పరిరక్షణ కమిటీ పేర్కొంది. డ్రైనేజీ తవ్వకాల కారణంగా సమీపంలోని విద్యుత్ స్తంభాలు బలహీనపడి, అనుకోని పరిస్థితుల్లో వంగినా లేదా నేలకు ఒరిగినా, సమీపంలోని సింగరేణి విద్యుత్ నిర్మాణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదం సంభవిస్తే కేవలం విద్యుత్ సరఫరాపైనే కాకుండా, సింగరేణి బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది.
విద్యుత్ శాఖ లేకా కార్పొరేషన్ నిర్లక్ష్యమా?
విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే సమయంలో జాతీయ రహదారి పక్కన భవిష్యత్‌లో డ్రైనేజీ నిర్మాణ ప్రణాళికను పరిగణనలోకి తీసుకున్నారా? విద్యుత్ శాఖ ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులకు ముందుగానే తెలియజేసిందా లేదా? ఒకవేళ చేసినా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ప్రణాళిక లేకుండా ఒక శాఖ చేసిన పని.. మరో శాఖకు ఇప్పుడు తలనొప్పిగా మారితే, చివరకు ఆ భారాన్ని ప్రజలే ఎందుకు భరించాలి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి : రామవరం పరిరక్షణ కమిటీ
జాతీయ రహదారి ప్రణాళికకు అనుగుణంగా విద్యుత్ శాఖ తక్షణమే అడ్డంకిగా ఉన్న స్తంభాలను తొలగించి, సురక్షితమైన ప్రాంతంలో పునఃస్థాపించాలని రామవరం పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. కార్పొరేషన్ అధికారులు కూడా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని డ్రైనేజీ పనులను శాస్త్రీయ ప్రణాళికతో చేపట్టాలని కోరింది. ముందుచూపు లేని పనుల కారణంగా ప్రజాధనం వృథా కాకుండా, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడకముందే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. ప్రణాళిక లేకుండా పనులు చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల బాధ్యతను నిర్ధారించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రామవరం ప్రజల భద్రతకు సంబంధించిన ఈ సమస్యపై అధికారులు, సంబంధిత శాఖలు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రామవరం పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.

ప్రణాళిక లేని పనులు.. ప్రజాధనానికి పాతర!
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

